కలం, హనుమకొండ: పోగొట్టుకున్న ఐదు సెల్‌ఫోన్లను సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా గుర్తించిన హనుమకొండ పోలీసులు (Hanumakonda Police) వాటిని బాధితులకు తిరిగి అందజేశారు. సోమవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత ఫోన్లను యజమానులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నవారు వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ నరసింహారావు, ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్, కానిస్టేబుల్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

