రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌యూటీఎఫ్‌ వార్నింగ్

​కలం, ఖమ్మం బ్యూరో: ​ప్రాథమిక పాఠశాలల పాలిట మరణ శాసనంగా మారిన జీవో నెం.25ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం () జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ డిమాండ్ చేశారు. జీవో 25ను సవరించకపోతే ఉద్యమాలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం 13వ మండల మహాసభలో షేక్ రంజాన్ మాట్లాడారు.

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని, కేవలం హాజరు నమోదు సరిపోదని తరగతి గదుల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే పరిస్థితులు కల్పించాలని షేక్ రంజాన్ కోరారు. ‘స్పర్శ్’ నిబంధనల వల్ల ప్రధానోపాధ్యాయులు బిల్లుల కోసం దుకాణాల చుట్టూ తిరిగే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తేనే..

​ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి డి.ఎస్‌.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బకాయిపడిన నాలుగు డీఏలు, పీఆర్సీ నివేదిక అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణతో పాటు ఈ-కుబేర్ పెండింగ్ బిల్లులను వెంటనే పరిష్కరించాలని కోరారు. కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల మంజూరు, గిరిజన శాఖలో పీడీ, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ చేయాలన్నారు.

సీఆర్టీ, కేజీబీవీ, యూఆర్‌ఎస్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, డీఎస్సీ 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డి.ఎస్‌.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ​అనంతరం ఏన్కూరు మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి. రాంచంద్, ప్రధాన కార్యదర్శిగా మూడ్ పుల్లయ్య, ఉపాధ్యక్షులుగా శ్రీదేవి, సిహెచ్. శంకర్‌రావు, కోశాధికారిగా బి. నరసింహారావు ఎన్నికయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>