SIR ప్రక్రియపై రాజకీయ పార్టీలతో అదనపు కలెక్టర్ సమావేశం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్ , 75–జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి జె.ఎల్.బి. హరిప్రియ (Additional Collector Haripriya) సోమవారం జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎస్‌ఐఆర్–2026 పురోగతిని (SIR 2026 Progress) సమీక్షించారు. ఈ సమావేశానికి జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, నవాబ్‌పేట్, మిడ్జిల్ మండలాల తహసీల్దార్లు, జడ్చర్ల అదనపు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు ఉర్కొండ, రాజాపూర్, మిడ్జిల్, నవాబ్‌పేట్ మండలాల ఎంపీడీవోలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏఎస్డీడీ కేటగిరీల కింద గుర్తించబడిన కారణంగా పేర్లు చోటు చేసుకోని ఓటర్లకు, తగిన పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు మరో అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఏఎస్డీడీ జాబితాను మరోసారి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసి, అర్హులైన ఓటర్లను గుర్తించి వారి వివరాలను పరిశీలించాలని తెలిపారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా సంబంధిత బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ, అర్హులైన ఓటర్లు అవసరమైన పత్రాలతో క్లెయిమ్‌లు సమర్పించేలా సహకరించాలని కోరారు. అదేవిధంగా, ఈ అవకాశంపై ఎన్నికల అధికారులు మరియు రాజకీయ పార్టీలు తమ తమ స్థాయిల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, అర్హులైన ప్రతి ఓటరికి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం ఎస్‌ఐఆర్–2026లో భాగంగా అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార పురోగతిని, ఏఎస్డీడీ ఓటర్ల పునఃపరిశీలన ప్రక్రియను సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించి, క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తుది ఓటర్ల జాబితాలో చోటు కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>