ఖో ఖో క్రీడలో స్వర్ణమే లక్ష్యం.. క్రీడాకారులకు మంత్రి వాకిటి శ్రీహరి పిలుపు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి, జాతీయ స్థాయిలో వారికి మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలకు తెలంగాణ క్రీడాకారులను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) పేర్కొన్నారు.

సోమవారం మక్తల్ గ్రౌండ్‌లో ఖేలో ఇండియా ఎంపికల్లో భాగంగా ఖో ఖో క్రీడాకారులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కల్పించిన వసతులు, శిక్షణ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడాకారులతో, జిల్లా క్రీడా శాఖ అధికారి వెంకటేష్‌తో మాట్లాడి వారి సాధన, శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మక్తల్‌లో ఖో ఖో క్రీడకు సంబంధించి మొత్తం మూడు ఎంపిక శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా, మొదటి శిబిరం ఈ నెల 1వ తేదీన ప్రారంభమైందని తెలిపారు. ఈ మూడు శిబిరాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన మొత్తం 15 మంది క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న ఖేలో ఇండియా క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యంగా ఖో ఖో విభాగంలో తెలంగాణ జట్టు స్వర్ణ పతకం సాధించి రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను జాతీయ స్థాయిలో చాటాలని పిలుపునిచ్చారు.

క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ, మెరుగైన వసతులు కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించే సత్తా తెలంగాణ యువతకు ఉందన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీయడం ప్రభుత్వ లక్ష్యమని, క్రీడాకారులు పట్టుదల, క్రమశిక్షణతో సాధన చేసి విజయాలు సాధించాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>