కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం (Buggaram Mandal) అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నగునూరి నర్సగౌడ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సగౌడ్ మాట్లాడుతూ… బుగ్గారం మండల ప్రజల చిరకాల కోరిక అయిన బుగ్గారం అడ్డ రోడ్డు నుండి బుగ్గరాం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) శాశ్వత భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు.
అలాగే శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుండి సహాయం అందించాలని మంత్రి కోరినట్లు ఆయన వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని నర్సగౌడ్ తెలిపారు. బుగ్గారం మండల (Buggaram Mandal) అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, కార్యకర్తల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నక్క రాజయ్య, తాడెపు లింగన్న, దసర్తి పోసన్న, కేలేటి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

