వైఎస్సార్ నగర్‌పై ఎమ్మెల్యే నాయిని స్పష్టత

కలం, హనుమకొండ: కాజీపేట వైఎస్సార్ నగర్ భూముల వివాదంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (MLA Naini Rajender Reddy) స్పందించారు. ఆ భూములు ప్రైవేటువా.. ప్రభుత్వానివా అనే అంశంపై స్పష్టతనిస్తూ, ప్రైవేటు భూమి అయితే జోలికి వెళ్లబోమని, ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. అక్కడ నివసిస్తున్న అర్హులైన పేదలకు ఇళ్ల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

వైఎస్సార్ నగర్‌ (YSR Nagar)లో అర్హులైన 42 మందికి ఇప్పటికే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేశామని, మిగిలిన 10 మంది అర్హులకు రెండో విడతలో ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే అక్కడి ఎస్ఎస్ఎస్ కాంప్లెక్స్‌కు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వాస్తవాలను గుర్తించాలని కోరారు.

కాజీపేట సోమిడి 62వ డివిజన్‌లో రూ.17 లక్షలతో ఎస్సీ కాలనీ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>