కలం, వనపర్తి: వనపర్తి పట్టణ స్వర్ణకారుల సంఘం (Goldsmiths Association) ఎన్నికల్లో అధ్యక్షుడిగా గన్నోజు మోహనాచారి రెండోసారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా నవీనాచారి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా శ్యామ్‌సుందర్, మాధవాచారి వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మోహన్, నారాయణదాస్ అనిల్, కృష్ణయ్య, కంసలి నాగార్జున్ తదితరులు పోటీ చేశారు. ఈ సందర్భంగా మోహనాచారి మాట్లాడుతూ.. స్వర్ణకారుల సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్యులందరి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు.

