ఆత్మహత్య కేసులో ఇరికిస్తానంటూ లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన ఎస్సై రమేష్!

కలం, బజార్‌హత్నూర్‌: ఆత్మహత్య కేసులో ఇరికిస్తానని డబ్బుల డిమాండ్‌ చేసి లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు అవినీతి ఎస్సై పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పెళ్లికాని ఓ యువతి ఆత్మహత్యకు సంబంధించి నమోదైన కేసులో ఫిర్యాదుదారుడిని ఇరికించకుండా ఉండటంతో పాటు, తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు బజార్‌హత్నూర్‌ ఎస్సై జి. రమేష్‌ (SI Ramesh) రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు ఆ మొత్తాన్ని రూ.40 వేలకు తగ్గించారు.

ఈ క్రమంలో గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న పెట్రోల్‌ బంకు సమీపంలో సెంట్రింగ్‌ బాక్సుల కింద డబ్బులు పెట్టాలని ఎస్సై సూచించడంతో ఫిర్యాదుదారుడు అక్కడ నగదును ఉంచాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్సైని బుధవారం దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సైని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>