డిసెంబర్‌లో గోడౌన్లపై దండయాత్ర.. AIAWU కార్యదర్శి హెచ్చరిక!

కలం, ఖమ్మం బ్యూరో: దేశంలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. కరువు సహాయక చర్యలు చేపట్టకపోతే డిసెంబర్‌లో “మార్చ్ టు గోడౌన్స్” పేరుతో గోడౌన్లను ముట్టడించి, బద్దలు కొట్టి ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం (Khammam) లోని సుందరయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వాల నిర్లక్ష్య విధానాల వల్లే కరువు తీవ్రతరమైందని మండిపడుతూ, కరువు నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రూ. 2 లక్షల కోట్లు కేటాయించాలని, ఎఫ్‌సీఐ గోడౌన్లలోని ధాన్యాన్ని పేదలకు ఉచితంగా లేదా రాయితీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు.

​అలాగే, ఎస్ఐఆర్ ప్రక్రియలో అన్యాయంగా రద్దయిన 13 కోట్ల ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘పీపుల్స్ ఎగైనెస్ట్ ఎస్ఐఆర్’ పేరుతో విశాల ఐక్యవేదికగా సుదీర్ఘ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. వ్యవసాయ రంగానికి సబ్సిడీలను కోత విధించడం, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడం వంటి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలపై ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ ఏడాదికి 200 రోజులు పని, రూ. 600 కూలీ ఇవ్వాలని, నల్గొండలో జరిగే రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ​ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, ఖమ్మం డివిజన్ కార్యదర్శి పడిగల నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సారంగి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>