మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. స్టూడెంట్స్ సస్పెండ్!

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి (Kamareddy) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్లపై ర్యాగింగ్ (Ragging) కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై వేటు పడింది. 14 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఒక్కసారిగా ఇంతమందిపై చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. విచారణలో భాగంగా జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఘటనలో 14 మంది సీనియర్లను గుర్తించారు. ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఆరు నెలల పాటు, మరో 10 మందిని నాలుగు నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన వారిలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులూ ఉన్నారు.

విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చర్యలను ఉపసంహరించుకోవాలని ప్రిన్సిపాల్ ను వేడుకుంటున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ వాల్యా, హెచ్ఓడిలు ఈ ఘటనపై ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ర్యాగింగ్ (Ragging) ఎదుర్కొన్న బాధిత జూనియర్లు ఢిల్లీలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయడంతో వ్యవహారం సీరియస్ అయ్యింది. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.

Also Read : సంఘ సంస్క‌ర్త‌ల్లా బిల్డ‌ప్ ఇవ్వొద్దు: సందీప్ రెడ్డి వంగా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>