ట‌బు బ‌ర్త్ డే.. నాగార్జున స‌ర్‌ప్రైజ్‌!

క‌లం, సినిమా: సీనియ‌ర్ న‌టి ట‌బు బ‌ర్త్‌డే (Tabu Birthday) సంద‌ర్భంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. 28 ఏళ్ల త‌ర్వాత ఈ హిట్ పెయిర్ క‌లిసి న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ 100 నుంచి ఆమె ఫ‌స్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా టబుకు విషెస్ చెప్తూ నాగార్జున ఓ పోస్టు చేశారు. నిన్నే పెళ్లాడ‌తాలో పండు క్యారెక్ట‌ర్ ఎవ‌రూ మ‌ర్చిపోలేర‌ని, ఇప్పుడు కింగ్‌100లో మ‌హంతి ఝాన్సీ రాణిగా కూడా అలాగే గుర్తు పెట్టుకుంటార‌ని ఆమె క్యారెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేశారు. ఇక ఈ సినిమాను ట‌బు ఎంతో స్పెష‌ల్‌గా మార్చేశార‌ని నాగార్జున పేర్కొన్నారు. గ్లింప్స్‌లో ట‌బు త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం, ఫ‌స్ట్ లుక్ ఆధారంగా చూస్తే ట‌బు ఒక పొలిటిక‌ల్ లీడ‌ర్ పాత్ర‌లో నటిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ షార్ట్ వీడియోలో ట‌బు చెప్పిన డైలాగ్స్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే (Tabu Birthday) విషెస్‌తో పాటు, ఆమె క్యారెక్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ ఈ సినిమాకు ఆర్ఏ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిగ్ అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్నారు. ఇక నాగార్జున, ట‌బు మ‌ళ్లీ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.

Also Read : సంఘ సంస్క‌ర్త‌ల్లా బిల్డ‌ప్ ఇవ్వొద్దు: సందీప్ రెడ్డి వంగా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>