కలం, జోగులాంబ గద్వాల : ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల (MPTC,ZPTC Elections) నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లాలోని 19 గ్రామాల్లో మద్యం దుకాణాలు, 2బి బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ (Collector Rizwan Basha Shaik) ఆదేశించారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20(1) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేశారు.
అయిజ మండలంలోని పులికల్, వెనిసోంపురం, రాజాపురం,కేశవరం, కుతకనూరు గ్రామాలకు,అలంపూర్ మండలంలోని జిల్లెలపాడు, సుల్తాన్‌పురం, రాయలంపాడు, సింగవరం, కాశీపురం గ్రామాలకు వర్తిస్తాయని తెలిపారు. అదేవిధంగా ఉండవెల్లి మండలంలోని బస్వాపురం, పుల్లూరు, కల్గొట్ల, మెన్నిపాడు గ్రామాలు, రాజోలి మండలంలోని తుమ్మిళ్ల, ధన్వాడ, రాజోలి, పెద్దధన్వాడ, చిన్నధన్వాడ గ్రామాల పరిధిలో కూడా ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
సంబంధిత గ్రామాల్లోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల నిర్వాహకులు నిర్ణీత సమయంలో తప్పనిసరిగా మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు, వ్యాపారులు జిల్లా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వులకు సహకరించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

