కడెం ప్రాజెక్టు నీటి విడుదల పొడిగించాలి.. రైతు సంఘాల వినతి!

కలం, కడెం: కడెం ప్రాజెక్టు (Kadem Project) నుంచి సాగునీటి విడుదలను డిసెంబర్‌ 5వ తేదీ వరకు కొనసాగించాలని తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రాజెక్టు ఈఈ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఈ నెల 7వ తేదీతో నీటి విడుదల నిలిపివేస్తే 90 శాతం మంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసిన రైతులకు పంట చేతికందాలంటే డిసెంబర్‌ 5వ తేదీ వరకు నీటి తడులు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాకూర్ తిరుపతి, దుర్గం నూతన్ కుమార్, నాగెల్లి నర్సయ్య, దుర్గం శంకర్ ప్రసాద్, తాళ్లపల్లి పోశలింగం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>