కలం, సోన్: సాగునీటి కష్టాలతో సతమతమవుతున్న రైతులకు విద్యుత్తు మోటార్ల వైర్ల చోరీ కొత్త సమస్యగా మారింది. సరస్వతి కాలువ (Saraswati Canal) వెంట మోటార్లకు సంబంధించిన విద్యుత్తు వైర్లను దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రైతులు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. సోన్ మండలం (Soan Mandal) కడ్తాల్ గ్రామానికి చెందిన రైతులు కొత్తగొల్ల భోజన్న, బర్మ లక్ష్మణ్ సరస్వతి కాలువలోని మిగులు నీటిని వినియోగించుకుంటూ విద్యుత్తు మోటార్ల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు.
ఈ క్రమంలో న్యూ బొప్పారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ మరో వ్యక్తితో కలిసి కాలువ (Saraswati Canal) వెంట ఉన్న మోటార్ల విద్యుత్తు వైర్లను దొంగిలిస్తున్నట్లు రైతులు గుర్తించారు. మంగళవారం ఉదయం రైతులకు చెందిన మోటార్ల వైర్లను దొంగిలించి అక్కడి నుంచి పరారవుతుండగా రైతులు అప్రమత్తమై ఇద్దరినీ చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. గత కొద్ది రోజులుగా మోటార్ల వైర్లు వరుసగా చోరీకి గురవుతుండటంతో తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు సమయంలో ఇలాంటి చోరీలు తమకు మరింత ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
Also Read : ‘కాన్వా’లో లే ఆఫ్స్.. 1,271 మందిపై వేటు!
Follow Us On: X(Twitter)

