భారత్​–పాక్​ సరిహద్దులో కుట్ర.. రైల్వే ట్రాక్‌ బ్లాస్ట్!

కలం, వెబ్​ డెస్క్​: రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లాలో భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో రైల్వే ట్రాక్‌పై పేలుడు (Rajasthan Railway Track Blast) కలకలం రేపింది. అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ రైల్వే మార్గంలో జరిగిన ఘటనతో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఆ మార్గంలో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. పేలుడు కారణంగా రెండు కాంక్రీట్ పిల్లర్లు, రైల్వే స్లీపర్లు ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం దాదాపు 200 మీటర్ల దూరం వరకు వినిపించినట్లు తెలుస్తోంది.

ప్రయానికులే లక్ష్యంగా కుట్ర?

మంగళవారం రాత్రి అనూప్ గఢ్ నుంచి సూరత్ గఢ్ కు వెళ్లిన కాసేపటికే పేలుడు జరిగింది. ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని కుట్ర ఉండా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏటీఎస్, డాగ్ స్వ్కాడ్ ఆధారాలు సేకరిస్తున్నాయి.

పేలుడు (Rajasthan Railway Track Blast) సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు (ఆర్పీఎఫ్), రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్), నేర పరిశోధన విభాగం (సీఐడీ), డాగ్ స్క్వాడ్, ఇతర భద్రతా బృందాలు కూడా అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి. ప్రస్తుతం ఈ పేలుడు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>