ఫాక్స్ న్యూస్‌పై విరుచుకుపడ్డ ట్రంప్: అసలు కారణం ఇదే!

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ఫాక్స్ న్యూస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫాక్స్ న్యూస్ రేటింగ్‌లు 27 శాతం మేర పడిపోయాయని, డెమొక్రాట్లకు ఎక్కువ సమయం కేటాయించడమే దీనికి ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఫాక్స్ న్యూస్ వీక్షించడం మానేసిన వారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందని ట్రంప్ పేర్కొన్నారు.

తనకు మద్దతు గ్రాఫ్ ఎప్పుడూ లేనంతగా పెరిగిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొత్త సిఎన్‌ఎన్ పోల్ ప్రకారం రిపబ్లికన్లలో తనకు 99 శాతం మద్దతు ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా అత్యంత ప్రజాదరణ పొందిన రిపబ్లికన్ అధ్యక్షుల జాబితాలో రోనాల్డ్ రీగన్ 18 శాతం, అబ్రహం లింకన్ 8 శాతంతో ఉండగా, తాను 53 శాతంతో అగ్రస్థానంలో ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. ఫాక్స్ కార్పొరేషన్ ప్రతిపక్ష డెమొక్రాట్లకు, వారి ప్రచార కమిటీలకు నిధులు కేటాయిస్తోందని, అందుకే ఆ ఛానెల్ రేటింగ్‌లు దారుణంగా పడిపోతున్నాయని ఆయన విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>