ఊర చెరువు FTL పరిధిలో అక్రమ గోడౌన్ కూల్చివేయాలి: బీజేపీ

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) నగర పాలక సంస్థ 17వ డివిజన్ పరిధిలోని ఊర చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గోడౌన్‌ను వెంటనే కూల్చివేసి చెరువును పరిరక్షించాలని బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు కేంచ శేఖర్ (Kencha Shekar) డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో కేంచ శేఖర్, బీజేపీ నాయకులతో కలసి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్గం శ్రీనివాస్, సర్గం మల్లేశం, సర్గం రాజు అనే వ్యక్తులు మున్సిపల్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కొత్తపల్లి పరిధిలోని ఊర చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా గోడౌన్ నిర్మాణం చేపట్టారని తెలిపారు. గతంలో ఇరిగేషన్ అధికారుల సూచనల మేరకు మున్సిపల్ అధికారులు ఈ నిర్మాణంపై నోటీసులు ఇచ్చి, కేటాయించిన ఇంటి నంబర్‌ను కూడా రద్దు చేశారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు గోడౌన్‌ను పూర్తిగా తొలగించలేదని పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుపై కలెక్టర్, కమిషనర్ సానుకూలంగా స్పందించారని.. ఆర్‌డీవో, ఇరిగేషన్ మున్సిపల్ అధికారులతో సమీక్షించి తక్షణమే ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారని కేంచ శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముత్తునూరి హరీశ్, జేరిపోతుల శ్రీకాంత్, దుబాయ్ సునీల్, ఎస్. రమేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>