కలం, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో బుధవారం నుండి మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌కు సంబంధించి టీమిండియా బ్యాటింగ్ ప్రణాళికలను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) స్పష్టం చేశారు. ఆక్లాండ్‌లో జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందు ఆయన ఈ వివరాలను వెల్లడించారు. భారత జట్టు టాప్-4 బ్యాటింగ్ స్థానాలు పూర్తిగా ఖరారయ్యాయని గిల్ తెలిపారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మొదటి నాలుగు స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. టాప్-4 లో ఉన్నవారంతా కుడిచేతి వాటం బ్యాటర్లే కావడంతో ఐదు, ఆరు స్థానాల్లో పరిస్థితులకు తగ్గట్లు మార్పులు చేస్తామని చెప్పారు.
జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అవసరమైనప్పుడు అక్షర్ పటేల్(Axar Patel)ను ముందుగా పంపనున్నట్లు గిల్ వెల్లడించారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా మార్పులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడిన గిల్, మెడ నొప్పితో తనకు ఎలాంటి సమస్య లేదని తెరిపించారు. ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు గంటన్నర పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్ సాధన చేశానని తెలిపారు. నాణ్యమైన శిక్షణ కోసం సొంత ఖర్చులతో నెట్ బౌలర్లను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు.
తొలి మూడు మ్యాచ్‌లకు గిల్ (Shubman Gill) కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆ తర్వాత టెస్టు సిరీస్ సన్నాహకాల కోసం ఆయన దూరమవ్వగా, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు నాయకత్వం వహిస్తారు. రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీ ఎన్నికల బరిలో మను భాకర్
Follow Us On : WhatsApp

