కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసాన్‌పల్లి (Ramsanpalli)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు తలారి వెంకటేశం (40), మన్నే లక్ష్మయ్య (42) పొలంలో పనులు చేస్తున్న క్రమంలో పైన ఉన్న మెయిన్ విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. ఈ ప్రమాదంలో వెంకటేశం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లక్ష్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి రైతులు, గ్రామస్థులు వెంటనే లక్ష్మయ్యను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన రైతు మరణించడం, మరొకరు పరిస్థితి విషమంగా ఉండటంతో రాంసాన్ పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

