కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత: ఎస్పీ జానకి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు నవంబర్ పదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ డి.జానకి (SP Janaki) తెలిపారు.మంగళవారం కురుమూర్తి దేవాలయాన్ని సందర్శించి, జాతర ప్రాంగణం, పరిసర ప్రాంతాలను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఉద్దాల ఉత్సవానికి ప్రాధాన్యత..

నవంబర్ 16న బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఉద్దాల ఉత్సవం జరుగుతుందని, ఆ రోజున భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఎస్పీ జానకి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అదనపు పోలీస్ బలగాలను మోహరించడం, రద్దీని క్రమబద్ధీకరించడం, భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి భక్తుడు సురక్షితంగా స్వామివారిని దర్శించుకుని ప్రశాంతంగా తిరిగి వెళ్లేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పార్కింగ్ స్థలాల గుర్తింపు, వాహనాల దారి మళ్లింపు, బారికేడింగ్, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ, క్రౌడ్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>