జంగ ఒర్రెకు కల్వర్టులు నిర్మించాలి.. అడ్లూరికి గ్రామస్తుల వినతి

కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని బుగ్గారం (Buggaram) మండల కేంద్రంలో దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న జంగ ఒర్రె ( Janga Orre) సమస్యకు చివరకు పరిష్కారం లభిస్తోంది. కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, రెండు వైపులా నిర్మాణాలు చేపట్టకపోతే అసలు ప్రయోజనం నెరవేరదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలంలో జంగ ఒర్రె ఉధృతంగా ప్రవహించడం వల్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఈ మార్గం ద్వారా పాఠశాల, హాస్టల్ విద్యార్థులు, రైతులు, కాలనీవాసులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ఒకవైపు మాత్రమే కల్వర్టు నిర్మాణానికి బడ్జెట్ కేటాయించడంతో, మరోవైపు నుంచి వచ్చే వరద నీరు నేరుగా కాలనీలోకి చేరి ఇళ్లు, ఆస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు.

ఈ సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ-రాజయ్య చొరవ తీసుకొని రెండు వైపులా కల్వర్టులు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, బడ్జెట్ కొరత అడ్డంకిగా మారిందని, అధికారులు చెబుతున్నారని, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. కావున ప్రజల భద్రతను, కాలనీవాసుల ఇళ్ల రక్షణను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అదనపు నిధులు మంజూరు చేసి, జంగ ఒర్రెకు ఇరువైపులా కల్వర్టుల నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ చూపి నిధులు కేటాయించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>