ప్రమాదాలు జరగకుండా చర్యలు: గద్వాల ఎస్పీ

కలం, జోగులాంబ గద్వాల: జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు (SP Srinivasa Rao) పోలీస్, జాతీయ రహదారి అథారిటీ అధికారులకు సూచించారు. మంగళవారం బీచుపల్లి నుంచి అలంపూర్ టోల్ గేట్ వరకు ఉన్న 44వ నెంబర్ జాతీయ రహదారిని పరిశీలించారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే హాట్ స్పాట్లను తనిఖీ చేసి ఇటీవల రోడ్డు ప్రమాదాలకు కారణాలను డీఎస్పీ మొగిలయ్యను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట సైన్ బోర్డ్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలని.. రోడ్డులో ఏమైనా లోపాలుంటే మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు.

వేగ నియంత్రికలు ఏర్పాటు..

జాతీయ రహదారిపై అవసరమైన చోట వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలని ఎస్పీ టి.శ్రీనివాస రావు సూచించారు. జాతీయ రహదారిపై ప్రధాన స్టేజీల దగ్గర ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్నందున.. సర్వీస్ రోడ్ల పక్కన సైడ్ స్థాపర్లకు రేడియం స్టిక్కరింగ్ వేయించాలన్నారు. రోడ్డుపై వాహనాలు నిలపకుండా హైవే పెట్రోలింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అలంపూర్, శాంతి నగర్ సీఐలు ప్రదీప్, శంకర్, ఎస్సైలు రవి, తరుణ్ కుమార్, స్వాతి, సురేష్, హైవే ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీధర్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>