కలం, జోగులాంబ గద్వాల: కేటిదొడ్డి (KT Doddi) మండలంలోని గువ్వలదిన్నె నుంచి నందిన్నె గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గువ్వలదిన్నె గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ మల్లేష్ గౌడ్, విద్యార్థులు మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కోరారు. గువ్వలదిన్నె గ్రామానికి చెందిన 60 మంది విద్యార్థులు నందిన్నె జెడ్పీహెచ్‌ఎస్ (Nandinne ZPHS) లో విద్యను అభ్యసిస్తున్నారని, మైళ్ల దూరం ఉండటంతో విద్యార్థినులు కాలినడకన స్కూల్‌కు వెళ్తున్నారని పేర్కొన్నారు. గ్రామం నుంచి రవాణా సౌకర్యం లేక, ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంగళవారం విద్యార్థులతో కలిసి గద్వాల డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. గువ్వల దిన్నె గ్రామానికి చెందిన సుమారు 60 మంది విద్యార్థులు నందిన్నె జెడ్పీహెచ్‌ఎస్ (Nandinne ZPHS) లో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఉదయం, సాయంత్రల వేళల్లో గద్వాల – రాయచూర్‌కు రాకపోకలు సాగించే ఆర్టీసి బస్సులను గువ్వలదిన్నె గ్రామాల మీదుగా రాకపోకలు కొనసాగిస్తే మహిళలు, వృద్ధులు, విద్యార్థుల ప్రయాణ సమస్యలను తీరుతాయని తెలిపారు.
Also Read : ఒక్కరోజే రూ.80వేల కోట్ల సంపాదన.. ముకేశ్ అంబానీ రికార్డ్
Follow Us On: X(Twitter)

