‘భూ భారతి’ దరఖాస్తులపై నిర్లక్ష్యం వద్దు.. అదనపు కలెక్టర్ ఆదేశాలు!

కలం, వనపర్తి: భూ భారతి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల (Bhu Bharati Applications) ను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని వనపర్తి (Wanaparthy) అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. అలాగే భూదాన్ భూములను గుర్తించి, వాటి వివరాలను పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మంగళవారం రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూ భారతి పెండింగ్ దరఖాస్తులు, భూదాన్ భూముల గుర్తింపు, భూముల రీసర్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారులతో మాట్లాడిన అదనపు కలెక్టర్.. పెండింగ్ దరఖాస్తులను (Bhu Bharati Applications) నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని, భూదాన్ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం వేగవంతం చేసి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, డీఆర్వో రామ్‌రెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సర్వే ఏడీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read : తుమ్మిడిహెట్టి బ్యారేజీపై సీఎం రేవంత్ సమీక్ష

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>