ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టి ట్రాపిక్ ఫ్రీ సిటీగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) పోలీస్ అధికారులను ఆదేశించారు. వీలైనంత మేరకు సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా చూడాలన్నారు. అందుకోసం అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అలాగే చెత్త ఎక్కడా కనిపించవద్దని, అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఉండేలా నిరంతరం చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. నగరంలో రోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతూనే ఉండాలని.. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

నిర్మాణ వ్యర్థాలపై ప్రత్యేక దృష్టి..

నిర్మాన వ్యర్థాల తరలింపులో ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణకు ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. మరోవైపు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ఉద్దేశంతో ప్రారంభించిన గ్రీన్ ట్యాంకర్లను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. నిర్మాణ రంగం, గ్రీనరీ మెయింటెనెన్స్, పార్కులకు తాగునీటికి బదులు శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా చేస్తే.. తాగునీటిని మరింత ఎక్కువ మందికి సరఫరా చేయొచ్చన్నారు. ప్రస్తుతం జలమండలి ఆధ్వర్యంలో 28 గ్రీన్ ట్యాంకర్ల సేవలు అందుబాటులో వచ్చాయన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>