నమన్ ధీర్‌కు ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డు

కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ (Naman Dhir) అద్భుత ప్రదర్శనతో మెరిశారు. తొలి విదేశీ పర్యటనలోనే జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించి ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాన్ని దక్కించుకున్నారు. హమిల్టన్‌లో ఐదో టీ20 ముగిశాక, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆడ్రియన్ లీ రూక్స్ చేతుల మీదుగా నమన్ ఈ మెడల్ అందుకున్నారు. తొలి విదేశీ టూర్‌లోనే ఈ గౌరవం దక్కడం చాలా సంతృప్తినిచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన నమన్ మొత్తం 138 పరుగులు చేశారు. తొలి మ్యాచ్‌లో 42 (నాటౌట్), రెండో మ్యాచ్‌లో 31, మూడో మ్యాచ్‌లో విన్నింగ్ ఫోర్ కొట్టి సిరీస్ విజయంలో భాగమయ్యారు. అలాగే చివరి రెండు మ్యాచ్‌లలో వరుసగా 28, 33 పరుగులు సాధించారు. ఈ సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో సొంతం చేసుకుంది. టీ20 సిరీస్ ముగియడంతో, ఇరు జట్ల మధ్య బుధవారం ఆక్లాండ్‌లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>