ఓటరు జాబితా సవరణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షిషా

కలం, ఆదిలాబాద్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Voter List Revision) ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న పనులను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పురోగతి, ఫారం- 6,7,8 దరఖాస్తుల పెండింగ్, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రూ, తదితర అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఫారం-6, 7, 8 దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, ఎస్‌ఐఆర్‌లో తప్పుగా మ్యాపింగ్ అయిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అనర్హుల విషయంలో తగిన ఆధారాలతో రికార్డులు భద్రపరచాలన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం జిల్లాలో 74 మందికి మాత్రమే హియరింగ్ నిర్వహించాల్సి ఉందని, మిగిలిన మ్యాపింగ్ తప్పులను త్వరలోనే సరిదిద్దుతామని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో దరఖాస్తులను త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్డీవో జగదీశ్వర్‌ రావు, పట్టణ తహసిల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి నలంద ప్రియ, నాయబ్ తహశీల్దార్ మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>