కలం, స్పోర్ట్స్: ఫార్ములా వన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇటలీ యువ డ్రైవర్ కిమీ ఆంటోనెల్లీ (Kimi Antonelli) సంచలనం సృష్టించాడు. కేవలం 20 ఏళ్ల 68 రోజుల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రిలో మూడో స్థానం సాధించి టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. దీంతో సెబాస్టియన్ వెటెల్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయస్కుడైన ఛాంపియన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆంటోనెల్లీకి ఇది రెండో ఫార్ములా వన్ సీజన్ మాత్రమే. ఈ ఏడాది అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌షిప్‌లో ఆధిక్యం సాధించాడు. చైనా గ్రాండ్‌ప్రి విజయంతో తన జోరును మొదలుపెట్టాడు. బెల్జియం, స్పెయిన్‌లోనూ గెలిచాడు.
ఇటలీ గ్రాండ్‌ప్రిలో సొంతగడ్డపై విజయం సాధించి అభిమానులను అలరించాడు. మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో 1953 తర్వాత ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి ఇటాలియన్‌గా కూడా ఆంటోనెల్లీ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఆల్బెర్టో ఆస్కారీ ఇటలీ తరఫున 1952, 1953లో వరుసగా రెండు టైటిళ్లు గెలిచాడు. ఇక ఫార్ములా వన్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన వారి జాబితాలో ఆంటోనెల్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.
23 ఏళ్ల 134 రోజుల వయసులో టైటిల్ గెలిచిన సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానానికి పడిపోయాడు. 23 ఏళ్ల 300 రోజుల వయసులో ఛాంపియన్ అయిన లూయిస్ హామిల్టన్ మూడో స్థానంలో ఉన్నాడు. 24 ఏళ్ల 58 రోజుల వయసులో టైటిల్ గెలిచిన ఫెర్నాండో అలోన్సో నాలుగో స్థానంలో నిలిచాడు. 24 ఏళ్ల 73 రోజుల వయసులో విజేతగా నిలిచిన మాక్స్ వెర్‌స్టాపెన్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఆంటోనెల్లీ (Kimi Antonelli) రాకతో ఈ జాబితాలో కొత్త చరిత్ర నమోదైంది.
Also Read : ఇబ్రహీం మాజాకి మెస్సీ ఓటు.. కొపా ట్రోఫీ ఓటింగ్‌లో సంచలనం!
Follow Us On: X(Twitter)

