కలం, స్పోర్ట్స్: టీ20ల్లో అదరగొడుతున్న అభిషేక్ శర్మకు వన్డేల్లోనూ అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కోరాడు. వైట్‌బాల్ క్రికెట్లో చాలాకాలంగా నిలకడగా రాణిస్తున్న అభిషేక్‌కు ఇంకా ఎన్ని అవకాశాలు కావాలని ప్రశ్నించాడు. అతడి ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించాడు. అభిషేక్ బ్యాటింగ్‌తో పాటు అతడిలోని నాయకత్వ లక్షణాలు కూడా తనను ఆకట్టుకున్నాయని యువరాజ్ తెలిపాడు. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని అభిషేక్ ప్రోత్సహించే తీరు బాగుందని ప్రశంసించాడు. చిన్న వయసు ఆటగాళ్లకు అండగా నిలవడం మంచి నాయకుడి లక్షణమని పేర్కొన్నాడు.
అయితే అభిషేక్ భారత జట్టుకు కెప్టెన్ అవుతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని యువీ అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో టీమిండియాకు నాయకత్వం వహించాలంటే ముందుగా ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఉపయోగపడుతుందని సూచించాడు. మరోవైపు వన్డేల్లో అభిషేక్‌కు చోటు దక్కకపోవడంపై యువరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ మరింత మెరుగవ్వాల్సి ఉండొచ్చని పేర్కొన్నాడు.
అయితే అందుకు ముందుగా ఆడే అవకాశం రావాలని స్పష్టం చేశాడు. జట్టులో ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు ఉండటంతో పోటీ ఎక్కువగా ఉందని యువరాజ్ అంగీకరించాడు. అయినా అభిషేక్ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడని భావిస్తే.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు అతడికి 50 ఓవర్ల ఫార్మాట్లో అవకాశం కల్పించాలని సూచించాడు. కెప్టెన్ కాకపోయినా గొప్ప వైట్‌బాల్ క్రికెటర్‌గా అభిషేక్ ఎదుగుతాడని యువరాజ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

