హోంగార్డ్​ కుటుంబాలకు ఎక్స్​ గ్రేషియా చెక్కులు అందజేసిన ఎస్పీ

కలం, జోగులాంబ గద్వాల: విధి నిర్వహణలో మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు (Jogulamba Gadwal SP Srinivasa Rao) అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డ్ ఏ.స్వాములు, రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కె.ధన్ రాజ్ రాథోడ్ ల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియో ఫండ్స్ కింద రూ.5 లక్షల చెక్కులను సోమవారం జిల్లా ఎస్పీ తన చాంబర్​ లో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు.

విధి నిర్మహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ద్వారా అందాల్సిన సంక్షేమ ప్రయోజనాలు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాస్​ పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి అందాల్సిన మిగిలిన ప్రయోజనాలను కూడా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల పోలీస్ శాఖ నిరంతరం బాధ్యతతో వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో సాయి కృష్ణ, ఆర్. ఐ వెంకట్, మృతిచెందిన హోంగార్డుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>