తుపాన్ ఎఫెక్ట్.. పర్యాటకులకు బీచ్‌లోకి ‘నో’ ఎంట్రీ!

కలం, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుపాను (Murasu Cyclone) ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​‌లోని బాపట్ల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సూర్యలంక బీచ్‌ (Suryalanka Beach) ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తుపాను ప్రభావం నేపథ్యంలో సముద్ర తీరంలో పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంతాల్లోని ఎవరినీ అనుమంతించడం లేదు.

బీచ్ లోకి పర్యాటకులు, సందర్శకులు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అదే విధంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను తీవ్రత తగ్గేవరకు ఎవ్వరూ బీచ్ వద్దకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా, మురసు తుపాన్ సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు–నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>