కలం, యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని తెలంగాణ ప్రభుత్వ హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ (VP Gautham) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు, సూపరింటెండెంట్ శ్రీకాంత్, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

