కలం, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్లో భారీగా నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివరతన్ మహియా అనే యువకుడు జైపూర్ నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి నకిలీ కరెన్సీ తరలిస్తున్నట్లుగా రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా నిఘా పెట్టి సికింద్రాబాద్ స్టేషన్లో తనిఖీలు చేసి.. నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.60 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను గుర్తించారు. శివరతన్ నుంచి ఐఫోన్, ఇతర పరికరాలు తీసుకుని అరెస్ట్ చేశారు. దీని వెనుక ఓం ప్రకాష్ అనే మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతడి కోసం వెతుకుతున్నారు. నకిలీ కరెన్సీ వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

