కరాటేలో పాల‌మూరు బిడ్డ‌ల‌కు ఫ‌స్ట్ ప్రైజ్‌

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌ (Karate Championship) పోటీల్లో మహబూబ్‌న‌గ‌ర్‌ పట్టణానికి చెందిన ఆరాధ్య, స్నితిక టాస్ విభాగంలో మొదటి బహుమతి సాధించినట్లు హనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వాహకులు కోటకదిరే వెంకటేష్ తెలిపారు. ఆదివారం కొడంగల్ పట్టణంలోని మంజునాథ్ ఫంక్షన్ హాల్‌లో రెండవ నేషనల్ కరాటే ఛాంపియన్‌ పోటీలు జ‌రిగాయి. ఈ టోర్నమెంట్‌లో శ్రీ హనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్టూడెంట్, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్రాంచ్ నుంచి ఆరాధ్య, స్నితిక టాస్ విభాగంలో మొదటి బహుమతి సాధించారు. నందకిషోర్, అక్షయ్, వడ్డే నరేంద్ర కటాస్ విభాగంలో మొదటి బహుమతి సాధించారు. కటాస్‌లో విశాల్, చరణ్ రెండో బహుమతి సాధించారని నిర్వాహకులు వెంకటేష్ తెలిపారు. గెలుపొందిన విద్యార్థుల విద్యార్థులకు పథకాలు, సర్టిఫికెట్స్ ప్రదానం చేసిన‌ట్లు ఆర్గనైజర్ శ్రీనివాసులు, మాస్టర్స్ వెంకటయ్య, సాయిలు, రాము లింగం తెలిపారు. విజేత‌ల‌ను శ్రీ హనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు కోటకద్ర వెంకటేష్ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>