అక్టోబర్ లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే?

కలం, వెబ్ డెస్క్ : దేశీయంగా వ్యాపార లావాదేవీలు, వినియోగదారుల కొనుగోళ్లు పుంజుకోవడంతో అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు (GST Collections) ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ రాబడి ఏకంగా 23 శాతం (22.9%) పెరిగి రూ. 2.31 లక్షల కోట్లు దాటింది. గత నాలుగు సంవత్సరాలలో నమోదైన నెలవారీ వృద్ధి రేట్లలో ఇదే అత్యంత వేగవంతమైనది కావడం విశేషం. పండుగ సీజన్ డిమాండ్‌తో పాటు దిగుమతులపై వచ్చే రాబడి భారీగా పెరగడం ఈ ఊహించని రికార్డు స్థాయి వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.

మరోవైపు, అంతకుముందు నెలకు సంబంధించిన సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా జరిగిన ఖర్చులు దాదాపు 6 శాతం తగ్గి రూ. 2.04 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. దసరా, దీపావళి కొనుగోళ్లు , పండుగ ఆఫర్లు సెప్టెంబర్ నుండి అక్టోబర్‌కు మారడమే ఈ తాత్కాలిక తగ్గుదలకు కారణమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కాగా, ప్రస్తుత 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అక్టోబర్ వరకు స్థూల జీఎస్టీ వసూళ్లు 13.2 శాతం పెరిగి రూ. 14.77 లక్షల వరకు ఎగబకాయి. అయితే గతేడాది ఇదే కాలంలో జీఎస్టీ వసూళ్​లు రూ. 13.05 లక్షల కోట్లుగా ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>