మోడీపై విమర్శలు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పేదల ఓట్లను తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. రావణుడిని ఓడించడానికి వానర సైన్యం వచ్చినట్లుగానే, మోడీని గద్దె దించేందుకు తాము వచ్చామని పేర్కొన్నారు. రాంలీలా మైదాన్ వేదికగా ఓటు చోరీపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 13.5 కోట్ల ఓట్లను తొలగించారని, రాబోయే రోజుల్లో మరో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నరేంద్ర మోడీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని రైళ్లు ఆపినా, ఎలాంటి ఆంక్షలు విధించినా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం ఆగదని ఆయన తేల్చిచెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>