కలం, బాసర: బాసర రైల్వే స్టేషన్ (Basara Railway Station)లో కోతుల బెడదతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం భక్తులు బాసరకు వస్తుంటారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లో కోతుల సంచారం ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది. ప్లాట్‌ఫామ్‌లపై గుంపులుగా తిరుగుతున్న కోతులు ప్రయాణికుల బ్యాగులను లాక్కెళ్తుండటంతో వారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కోతుల భయంతో ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లేందుకు కూడా ప్రయాణికులు జంకుతున్నారు. నిత్యం వేలాద భక్తులు, ప్రయాణికుల రద్దీ ఉండే రైల్వే స్టేషన్‌లో ఈ సమస్యపై రైల్వే అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

