కలం, వెబ్ డెస్క్ : దీపావళి, ఛట్ పండగల వేళ వ్యాపారులకు ప్రభుత్వ చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ (Commercial LPG) సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కొత్త ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు మారాయి.
ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ.2,820కి చేరగా, ముంబైలో దీని ధర రూ.2,774.50గా నమోదైంది. కోల్కతాలో రూ.12 పెరుగుదలతో సిలిండర్ ధర రూ.2,971కి ఎగబాకింది. చెన్నైలో ఈ ధర అత్యధికంగా రూ.2,994.50 వద్ద కొనసాగుతోంది. పండుగల సీజన్లో హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలకు ఈ పెంపుదనంతో అదనపు భారం పడనుంది.

