రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం

కలం, నిర్మల్ : రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రం వేదిక కానుంది. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అండర్‌ జూనియర్స్ బాలబాలికల పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, క్రీడా సంఘాల ప్రతినిధులు కలిపి సుమారు 600 మంది పాల్గొననున్నారు. పోటీల నిర్వహణ కోసం మైదానాన్ని సిద్ధం చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

ఆదివారం ప్రారంభమయ్యే మ్యాచ్‌లు సోమవారంతో ముగియనున్నాయి. రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఒకే వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించనుండటంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఏర్పాట్లను జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షుడు పోశెట్టి, కార్యదర్శి అన్నపూర్ణ, డీజీపేట కార్యదర్శి వన్నెల భూమన్న, వ్యాయామ ఉపాధ్యాయుడు గస్కంటి గంగాధర్‌, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పరిశీలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>