కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టు నుంచి పక్కనపెట్టడంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్లాండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ ఏకంగా 259 పరుగులు సాధించి, టీమ్‌ఇండియాపై అత్యధిక టీ20 స్కోరు నమోదు చేసింది. ఈ ఘోర ప్రదర్శనకు కుల్దీప్ లేకపోవడమే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ గ్రౌండ్ చిన్నది కావడం వల్ల వేగంగా బౌలింగ్ చేసే అక్షర్ పటేల్, నమన్ ధీర్‌లను బ్యాటర్లు సులభంగా ఎదుర్కొన్నారని రాయుడు విశ్లేషించారు.
ఇలాంటి పిచ్‌పై కుల్దీప్ యాదవ్ అయితే వేగాన్ని తగ్గించి బంతిని గాలిలో తిప్పుతూ బ్యాటర్లను బోల్తా కొట్టించేవాడని పేర్కొన్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను గతంలో కుల్దీప్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా నాలుగుసార్లు ఔట్ చేసిన అద్భుత రికార్డు ఉందని రాయుడు గుర్తుచేశారు. అటువంటి వికెట్ టేకింగ్ బౌలర్‌ను పక్కనపెట్టి ఫుల్ లెంగ్త్ బౌలర్లపై ఆధారపడటంతోనే మ్యాచ్ చేజారిందని ఆయన స్పష్టం చేశారు.

