మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రి హత్య

కలం, నల్లగొండ: తాగుడు వ్యసనం రక్త సంబంధాన్ని కూడా ఎలా బలితీసుకుంటుందో చెప్పే ఘటన నల్లగొండ (Nalgonda) పట్టణంలో చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బుల కోసం కన్న తండ్రినే గొడ్డలితో నరికి చంపాడో కసాయి కొడుకు. నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి హనుమాన్ నగర్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… హనుమాన్ నగర్‌కు చెందిన సురిగిల లింగయ్య (70) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమారుడు గణేష్ (35) కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా, మద్యం సేవించడానికి డబ్బుల కోసం నిత్యం తండ్రితో గొడవపడుతుండేవాడు.

ఇంట్లో నుంచి గొడ్డలి తీసుకొచ్చి..

ఈ క్రమంలోనే మధ్యాహ్నం కూడా మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని తండ్రితో వాగ్వాదానికి దిగాడు. లింగయ్య నిరాకరించడంతో క్షణికావేశంలో అప్పటికే మద్యం మత్తులో ఉన్న గణేష్.. ఇంట్లో గొర్రెల మేత కోసం చెట్లు నరికేందుకు ఉపయోగించే గొడ్డలిని తీసుకుని తండ్రిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. తీవ్రమైన గాయాలతో లింగయ్య అక్కడికక్కడే రక్తమడుగులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఎస్సై ముత్తయ్య సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కసాయి కొడుకు గణేష్‌పై కేసు నమోదు చేసి, తప్పించుకున్న అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>