బుల్లెట్ ట్రైన్ కోసం కొత్త కారిడార్ ఏర్పాటు

కలం, వెబ్ డెస్క్: దేశంలో బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా నార్తర్న్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. ఇందుకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారని వివరించారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలయ్యే ఈ కారిడార్ ఆగ్రా, కాన్పూర్, లక్నో, అయోధ్య, వారణాసి, పాట్నా, గువాహటి వరకు ఉంటుందని వివరించారు. ఇది పూర్తయితే ఢిల్లీ నుంచి అయోధ్యకు 59 నిమిషాలు, ఢిల్లీ నుంచి వారణాసికి మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చన్నారు. బుల్లెట్ ట్రైన్ రేట్లు చాలా సాధారణంగా, ఫ్లైట్ టికెట్స్ కంటే తక్కువగా అందుబాటులోకి ఉంటాయని స్పష్టం చేశారు.

నార్తర్న్ కారిడార్ పూర్తయితే దేశ అభివృద్ధి ముఖచిత్రం కూడా మారిపోతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మరీ ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు, యువత, మహిళలు, చిన్న వ్యాపారవేత్తలకు ఇది ఎంతో లాభదాయకంగా ఉండబోతుందన్నారు. ఇక వారణాసి నుంచి వందే భారత్ స్లీపర్ ట్రైన్లను కూడా పెంచబోతున్నట్లు వివరించారు. రాత్రి వారణాసి నుంచి బయల్దేరి ఉదయానికి ఢిల్లీ చేరేలా వీటి షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

కొనసాగుతున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణం..

ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం 2027 ఆగస్టు నాటికి అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 62 శాతం పనులు పూర్తి కాగా.. పలు చోట్ల టన్నెల్స్, వంతెనలు, సిగ్నలింగ్ పనులు మిగిలి ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో 12 స్టేషన్లు నిర్మాణం కాబోతుండగా.. దాదాపు అన్ని పనులు చివర దశకు వచ్చేశాయి. ప్రధాని మోదీ తరచూ ఈ ప్రాజెక్ట్ పనులపై ఆరా తీస్తున్నారు. తొలి బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చాక.. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>