విషాదాన్ని మిగిల్చిన హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదం!

కలం, వెబ్‌డెస్క్‌: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా జోషీమఠ్ సమీపంలో జ‌రిగిన హెలీకాప్టర్ ప్రమాదం (Helicopter Crash) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురూ మృతి చెందినట్లు అధికారులు వెల్ల‌డించారు. మృతుల్లో పైలట్‌తో పాటు ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన ఈ హెలీకాప్టర్ బద్రీనాథ్ నుంచి ఫటాకు వెళ్తుండగా జోషీమఠ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో భారీ వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సిగ్న‌ల్స్ కోల్పోయి గల్లంతైన హెలికాప్టర్ ఆచూకీ కోసం రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి మృతదేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. పైల‌ట్ హిమాన్షు ఢిల్లీకి చెందిన వ్య‌క్తి కాగా, ఐదుగురు ప్ర‌యాణికులు క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన వార‌ని అధికారులు వెల్ల‌డించారు. మృతుల్లో అరుణ్‌, ప్ర‌తాప‌, శంక‌ర్ గౌడ‌, సుధీర్‌, న‌ట‌రాజ‌లు ఉన్న‌ట్లు తెలిపారు. వీరిలో అరుణ్ బెంగ‌ళూర్ క్రైమ్ బ్రాంచ్‌లో విధులు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>