ఇస్రో మరో అద్భుతం.. నేడు GSLV-F18 ప్రయోగం

కలం, వెబ్ డెస్క్ : నేడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (Shar) నుంచి నేడు రాత్రి 11:51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 (GSLV-F18) రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దేశ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు.

ఈ ప్రయోగం ద్వారా ఎన్‌వీఎస్‌-03 (NVS-03) ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. ఈ శాటిలైట్ బరువు సుమారు 2,232 కేజీలు కాగా, ఇది దాదాపు 13 ఏళ్ల పాటు కక్షలో విజయవంతంగా పనిచేస్తుందని ఇస్రో వెల్లడించింది. దీని ద్వారా దేశంలోని నావిగేషన్ సేవలు మరింత మెరుగవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>