కరీంనగర్ డీఆర్ఎఫ్ సిబ్బందికి రక్షణ కిట్లు పంపిణీ

కలం, కరీంనగర్ : విపత్తులతో పాటు ఇతర అత్యవసర సమయాల్లో నగర ప్రజలకు రక్షణ కల్పిస్తూ మెరుగైన సేవలందించాలని కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సూచించారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో 23 మంది డీఆర్ఎఫ్ బృందాల సిబ్బందికి ఆయన చేతుల మీదుగా రక్షణ కిట్లను (Safety Equipment) పంపిణీ చేశారు.

గతంలో నగరంలోని స్పోర్ట్స్ స్కూల్‌లో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన 23 మంది డీఆర్ఎఫ్ సిబ్బందికి (DRF Staff) వారం రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణను పూర్తి చేసుకుని విపత్తు నిర్వహణ మెలకువలు నేర్చుకున్న సిబ్బందికి జీహెచ్‌ఎంసీ ఈవీ అండ్ డీఎం డైరెక్టర్ నుంచి రక్షణ కిట్ల బ్యాగులు, శిక్షణ సర్టిఫికెట్లను నగరపాలక సంస్థకు పంపించారు. ఈ నేపథ్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న డీఆర్ఎఫ్ సిబ్బందికి కమిషనర్ రక్షణ కిట్లను అందించి, విధుల్లో వాటిని వినియోగించాలని సూచించారు. ఈ కిట్లలో లైఫ్ జాకెట్లు, షూలు, హెల్మెట్లు, టార్చ్‌లైట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇతర రక్షణ సామగ్రి ఉన్నాయి. అత్యవసర సమయాల్లో వీటిని ఉపయోగించాలని కమిషనర్ సూచించారు.

ఈ సందర్భంగా ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. శిక్షణలో పొందిన జ్ఞానాన్ని, నేర్చుకున్న మెలకువలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా వినియోగించాలని అన్నారు. నగర ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఏ క్షణంలోనైనా విపత్తు ఎదురైతే తక్షణమే స్పందించి ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని డీఆర్ఎఫ్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బండారి లక్ష్మణ్, బాబు, తిరుమలై, ఈ బాబు, మధుకర్, ప్రణయ్, వీర్ల లక్ష్మీనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>