30 తులాల బంగారం చోరీ కేసు.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​

క‌లం, మెద‌క్ బ్యూరో: బస్సు ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మెద‌క్ (Medak) జిల్లా నిజాంపేట పోలీసులు రట్టు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా బస్సులో చోరీకి గురైన 30 తులాల బంగారు ఆభరణాల కేసును పోలీసులు సవాలుగా తీసుకుని ఛేదించారు. ప్రధాన నిందితురాలిని అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి సుమారు 25 తులాల ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మెద‌క్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సూరం స్నేహ ఆగస్టు 26న రాఖీ పండుగ సందర్భంగా తన 30 తులాల బంగారు ఆభరణాలను బ్యాగ్‌లో పెట్టుకుని మెద‌క్ జిల్లా నిజాంపేటలోని తన తల్లిగారి ఇంటికి బయలుదేరారు. నిజాంపేట చేరుకున్న తర్వాత బ్యాగ్‌లోని నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి సరూర్‌నగర్‌కు చెందిన మేకల సంధ్య (30) ను నిందితురాలిని గుర్తించారు.

నిందితురాలు సుమారు 25 తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న ఇతర నిందితులను అరెస్ట్ చేసేందుకు, మిగిలిన సొత్తును స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బస్సులు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ప్రజలు తమ విలువైన ఆభరణాలు, నగదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, చోరీ జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>