బాసర ట్రిపుల్‌ ఐటీపై దుష్ప్రచారం తగదు: వీసీ గోవర్ధన్‌

కలం, బాసర: బాసర ఆర్జీయూకేటీ (Basara RGUKT) పై వస్తున్న అసత్య ప్రచారాలను యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. కలెక్టర్‌ పర్యటన సందర్భంగా అధికారులు అందుబాటులో లేరంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తలో వాస్తవాలను లేవని పేర్కొన్నారు. ముందస్తు అధికారిక సమావేశం కారణంగా తాను క్యాంపస్‌లో ఉండలేని విషయాన్ని కలెక్టర్‌కు ముందుగానే వివరించానని వెల్లడించారు.

పర్యటన పూర్తయ్యే వరకు ఫోన్‌ ద్వారా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించానని వీసీ గోవర్ధన్​ తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందన్నారు. క్యాంపస్‌లో ప్రశాంతమైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నిరాధార ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>