నాణ్యత విషయంలో రాజీ పడొద్దు.. రోడ్డు పనులపై ఎమ్మెల్యే ఆదేశాలు!

‎‎కలం, మిర్యాలగూడ: మిర్యాలగూడ (Miryalaguda) పట్టణ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) తెలిపారు. పట్టణంలోని బంగారు గడ్డ 29వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, 29వ వార్డు కౌన్సిలర్ జావీద్, ఇతర కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
‎
‎

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>