ట్రైన్‌లో ఫోన్‌ చార్జింగ్‌పై రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం!

క‌లం, వెబ్‌డెస్క్‌: ట్రైన్‌లో మొబైల్ చార్జింగ్‌పై భార‌తీయ రైల్వే (Indian Railways) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాత్రి స‌మ‌యంలో ఇక నుంచి రైళ్ల‌లో మొబైల్ చార్జింగ్‌ల‌ను అనుమ‌తించొద్ద‌ని నిర్ణ‌యించింది. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇకపై రాత్రి 11 గంట‌ల నుంచి తెల్ల‌వారుజామున 5 గంట‌ల వ‌ర‌కు చార్జింగ్ పాయింట్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా నిలిపివేయాల‌ని అన్ని జోన్‌ల రైల్వే అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఏ మేర‌కు అమ‌లు అవుతున్నాయో పర్యవేక్షించేందుకు రైల్వే అధికారులు, ప్ర‌త్యేక‌ సిబ్బంది రాత్రి వేళ‌ల్లో అన్ని కోచ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించింది.

రాత్రి వేళల్లో చార్జింగ్ సర్క్యూట్లను నిలిపివేయాలనే నిబంధనపై పదేళ్ల క్రిత‌మే సర్క్యులర్ జారీ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే కొన్ని రైళ్లలో ఈ నిబంధన సక్రమంగా అమలు కావడం లేదని వెల్లడించారు. ఇటీవల సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో రాత్రి వేళల్లో చార్జింగ్ పాయింట్లను నిలిపివేయకపోవడంతో, మొబైల్‌కు చార్జింగ్ పెడుతున్న సమయంలో పవర్ బ్యాంక్ పేలింది. దీంతో కోచ్‌లో పొగ వ్యాపించి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాలేద‌ని అధికారులు తెలిపారు. మరోవైపు రైల్వే అధికారుల నిర్ణ‌యంపై భిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. పూర్తిగా రాత్రి స‌మ‌యంలో చార్జింగ్ నిలిపివేసే బ‌దులు ప‌వ‌ర్ బ్యాంకుల వినియోగాన్ని నియంత్రిస్తే బాగుండేద‌ని ప్ర‌యాణికులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>