ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై లక్ష్మారెడ్డి ఫైర్..!

కలం, జడ్చర్ల: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి ప్రజా ప్రతినిధి స్థాయిలో ఉంటూ అర్థం లేని మాటలు మాట్లాడ‌టం మానుకోక‌పోతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి (Laxma Reddy) హెచ్చరించారు. బుధవారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనిరుధ్‌ ఆచరణ సాధ్యం కానీ మాటలతో ప్రజలను మభ్య పెట్టాలని చూడటం మానుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూలగొట్టించి స్థలాన్ని తనకు అప్పగిస్తే నెల రోజుల్లోపు ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తానని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు.

ఊరికే ఇతరులపై బురద చల్లడం తగదని తెలియక మాట్లాడుతున్నాడో, తెలిసి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఇంతకాలం చిన్నపిల్లోడు అని ఊరుకున్నానని, ఇక నుంచి అలా మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. విధివిధానాలు తెలియక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చిన్న కుర్రాడి కంటే హీనంగా మాట్లాడుతూ.. ప్రజల్లో తిరుగుతూ ఉండటం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొడగల్ యాదయ్య, పరమడయ్య, సతీష్, శీను, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>